Search
Friday 21 September 2018
  • :
  • :

నా కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ ‘శ్రీమంతుడు’

Maheshbabuమహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమంతుడు’ ఇటీవల విడుదలై అన్నిచోట్లా సూపర్‌హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఊరిని దత్తత తీసుకొని బాగుపరిచే ఓ శ్రీమంతుడి కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఓ మంచి సందేశమున్న కథాంశానికి కమర్షియల్ అంశాలు జోడించి తెరకెక్కించిన విధానానికి అంతటా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం సాధించిన విజయంపై మహేష్‌బాబు స్పందిస్తూ… “కథను నమ్మి ఈ సినిమా చేశాను. కొరటాల శివ మంచి కథ రాశారు. అందరం కథని ఫాలో అయ్యాం. మంచి కథకు టీమ్‌వర్క్ తోడైతే ఎంత పెద్ద విజయం వస్తుందో ‘శ్రీమంతుడు’ నిరూపించింది. నాన్న, అన్నయ్య, బాబాయ్ అందరికీ ఈ సినిమా బాగా నచ్చింది. ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అటు ఆడియన్స్ ముఖ్యంగా నా అభిమానులు ఈ విజయానికి ఎంతో ఆనందపడిపోతున్నారు. నా జీవితంలో ఈ ఏడాది బర్త్‌డే రియల్‌గా చాలా హ్యాపీగా ఉన్న బర్త్‌డే. ఈ సక్సెస్‌తో మరిన్ని మంచి సినిమాలు చేయడానికి నాకు ఉత్సాహం వచ్చింది. ఓ విధంగా చెప్పాలంటే ఈ విజయానికి కొరటాల శివ ముఖ్య కారకులు. ఆయనే ఈ సినిమాకి హీరో అని నా ఫీలింగ్. తొలి చిత్రమైనా నిర్మాతలు నవీన్, రవి, సివిఎం ఏవిధంగా రాజీపడకుండా సినిమా తీశారు. అన్ని విధాలా నేను సంతృప్తిచెందిన చిత్రం ‘శ్రీమంతుడు’. నా కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లో బెస్ట్ ఫిల్మ్ ఇది”అని అన్నారు.

రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులకు స్పెషల్ షోలు…
భారత ప్రధాని కాన్సెప్ట్ అయిన ఊరిని దత్తత తీసుకొని అభివృద్ధి పరచడమనే అంశంతో తెరకెక్కిన సినిమా కావడంతో రాజకీయ వర్గాల్లోనూ ‘శ్రీమంతుడు’పై మంచి ఆసక్తి కనిపిస్తోంది. అంతేగాకుండా తెలంగాణ రాష్ట్ర మంత్రి కెటిఆర్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు ఇతర రాజకీయ ప్రముఖులు కూడా శ్రీమంతుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలోనే సినిమాను మరింత ఎక్కువ మంది ప్రముఖులకు దగ్గర చేయాలన్న ఉద్దేశంతో కొన్ని స్పెషల్ షోలు వేసే దిశగా సినిమా టీమ్ ఆలోచిస్తోంది. ఇదే విషయమై దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ “మంచి సోషల్ మెసేజ్ ఉన్న ఈ సినిమాను అందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు. పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాను ఇంకా ఎక్కువమంది ప్రముఖులకు చేర్చాలన్న ఆలోచనైతే ఉంది. త్వరలోనే పలువురు రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులకు స్పెషల్ షోలు వేయాలని అనుకుంటున్నాం. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ కార్యక్రమాన్ని చేపడతాం”అని తెలిపారు.

Comments

comments