Search
Wednesday 26 September 2018
  • :
  • :

పూర్తయిన కాలేజీ ఎపిసోడ్స్ …

mb
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు నటిస్తున్న 25వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈనెల 17న డెహ్రాడూన్‌లో కాలేజీ ఎపిసోడ్స్‌తో మొదలుపెట్టిన టాకీ పార్ట్‌ను 20 రోజుల పాటు చిత్రీకరించారు. దీంతో ఈ షెడ్యూల్ పూర్తవడంతో సినిమా టీమ్ మొత్తం హైదరాబాద్‌కు తిరిగిరానుంది. పూజాహెగ్డే అక్కడ తన పార్ట్ షూటింగ్ పూర్తిచేసుకొని మరో సినిమా షూటింగ్‌కు వెళ్లిపోయింది. ఇక కీలకమైన అమెరికా షెడ్యూల్‌ను త్వరలోనే ప్రారంభించబోతున్నారు. మూడు నెలల క్రితమే అదే పనిగా న్యూయార్క్‌తోపాటు కీలకమైన ప్రదేశాలన్నీ తిరిగి వచ్చి షూటింగ్ స్కెచ్ వేసుకున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. అక్కడ చాలా కీలకమైన సన్నివేశాలతో పాటు రెండు పాటలు కూడా చిత్రీకరించనున్నట్లు టాక్. అల్లరి నరేష్ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటాడు. కాలేజీ బ్యాక్‌డ్రాప్ కాబట్టి డిఫరెంట్‌గా కనిపించడానికి గడ్డం పెంచిన మహేశ్ అదే లుక్ కొనసాగిస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఏప్రిల్ 5న రిలీజ్ డేట్‌ను ప్లాన్ చేసుకుంది ఈ చిత్రం. ‘భరత్ అనే నేను’ తరహాలో ఇందులో కూడా సందేశం ఉంటుందని కాకపోతే రైతులను సెంట్రల్ పాయింట్‌గా తీసుకొని వాళ్ల సమస్యను కథకు లింక్ చేస్తారట. ఇక మహేశ్, అల్లరి నరేష్ పాత్రలు ఎలా ఉంటాయనే విషయంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. సినిమా ఫస్ట్‌లుక్, టీజర్ వస్తే తప్ప ఒక అంచనాకు రాలేం.

Comments

comments