Search
Wednesday 18 July 2018
  • :
  • :

మైనారిటీ గురుకులంలో పస్తులుంటున్న విద్యార్థులు

Mainarity Gurukulam School Students Facing Problems

మనతెలంగాణ /లింగంపేట:  గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందించి వారిని ప్రయోజకులుగా చేయాలనే లక్షంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చి ంచి  గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. లింగంపేట మండల కేంద్రంలోని మైనారిటీ గురుకుల  పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గత ఏడాది కాలంగా  నాణ్యమైన భోజనం అందడం లేదు. దాంతో విద్యార్థులు  ప్రతిరోజు కడుపునిండా తినకలేకపోతున్నారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష ధోరణి కారణంగా 120 మంది విద్యార్థులు పస్తులుండే పరిస్థితులు నెలకొన్నా యి. “ అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ” అన్న చందంగా మారింది మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థుల పరిస్థితి. గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు  ప్రతిరోజు నీళ్లచారు, ఉడికి ఉడకని అన్నం పెడుతున్నా రు. ఒక్క రోజు కూడా మెనూ ప్రకారం భోజనం, స్నాక్స్  ఇవ్వడం లేదని  విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థులకు వడ్డించిన భోజనం రుచికరంగా లేకపోవడంతో విద్యార్థులు  భోజనాన్ని  పారవేస్తున్నారు. దాంతో  పందుల కడుపునిండుతోంది.  పాఠశాలలో  ఏడాది కాలంగా ఇదే తంతు కొనసాగుతున్నా పట్టించుకునే  వారు కరువయ్యారు. విజిలెన్స్ అధికారుల తనిఖీలు నామమాత్రంగానే ఉంటున్నాయని దీన్ని బట్టి తెలుస్తోంది. నెలలో నాలుగుసార్లు చికెన్, రెండు సార్లు మాంసం పెడుతున్నారు. కాని రుచికరంగా లేకపోవడంతో  మటన్, చికెన్ సైతం పందుల పాలవుతోం ది.  ప్రభుత్వం లక్షల రూపాయలను  ఖర్చు చేస్తున్నా పాఠశాల నిర్వాహకుల  నిర్ల క్షం  గురుకుల పాఠశాల విద్యార్థులకు శాపంగా మారి ంది.  భోజనం సక్రమంగా లే దని విద్యార్థులు చెబితే సదరు ప్రిన్సిపాల్ జయరాజ్  టిసిలు ఇచ్చి పంపిస్తా, మీరు కాకుం టే చాలా మంది విద్యార్థులు వస్తారు అని బెదిరిస్తున్నాడని విద్యార్థులు ఇటీవల పాఠశాలను తనిఖీ చేసిన ఎంపిపి ఆసియా మోహిద్ దృష్టికి  తెచ్చారు.

ఎంపిపి సయితం  నాణ్యమైన భోజనం పెట్టాల ని  పలుమార్లు  ప్రిన్సిపాల్ కు సూచించినా ఎలాంటి ప్రయోజనం  కన్పించడం లేదు. ఆదివారం  పాఠశాలలో 12 కేజీల  చికెన్ వండారు.  కాని చికెన్ రుచికరంగా లేకపోవడంతో  విద్యార్థులు  కడుపునిండా భోజనం చేయక  పందులకు పారబోసారు. విషయం తెల్సుకున్న స్థానిక  విలేకరులు కొందరు  పాఠశాలకు వెళ్లగా  ప్రిన్సిపాల్ గది మూసి ఉంది. పాఠశాలలో వండిన చికెన్‌ను పరిశీలించగా నీళ్ల చారులా ఉంది. ఇలా  ఎందుకు వండావని  కుక్కర్‌ను ప్రశ్నిస్తే  పొరపాటైంది సార్ అని సమాధానం ఇచ్చారు. మైనారిటీ గురుకుల పాఠశాలలో గత కొంత కాలంగా  విద్యార్థులకు కుళ్లిన అరటి పండ్లను, ఇద్దరు విద్యార్థులకు కలిపి ఒక బిస్కెట్ ప్యాకెట్‌ను అందజేస్తున్నారు. ఇదేం  సార్ అని ప్రిన్సిపాల్ జయరాజ్‌ను  విలేకరులు ప్రశ్నిస్తే  ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉంటున్నారు. ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి, కలెక్టర్ స్పందించి గురుకుల పాఠశాల విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Comments

comments