Home తాజా వార్తలు 50 కోట్ల క్లబ్ లో చేరిన ‘మజిలీ’

50 కోట్ల క్లబ్ లో చేరిన ‘మజిలీ’

Majili-Movie

హైదరాబాద్: నాగ చైతన్య – సమంత జంటగా నటించిన మజిలీ చిత్రం 50 కోట్ల క్లబ్ లో చేరింది. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘మజిలీ’. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈచిత్రం ఏప్రిల్ 05 న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా, తొలిరోజునే భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా చాలా తేలికగా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ముఖ్యం గా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ కావడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది. నాగ చైతన్య కెరియర్ లోనే బెస్ట్ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా మజిలీ నిలిచింది.

Majili journey grosses 50 Crore WorldWide