Home సినిమా వాలంటైన్స్ డే కానుకగా టీజర్

వాలంటైన్స్ డే కానుకగా టీజర్

పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న తొలి సినిమా ‘మజిలీ’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, సెకండ్ లుక్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు టీజర్ విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు ఫిల్మ్‌మేకర్స్. వాలంటైన్స్ డే సందర్భంగా ఈనెల 14న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య, సమంత కలిసి ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘నిన్ను కోరి’ లాంటి ఎమోషనల్ ఎంటర్‌టైనర్ తర్వాత దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మజిలీ’. ఈ చిత్రం చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. దివ్యాంశా కౌశిక్ ఈ చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటిస్తోంది. దేర్ ఈజ్ లవ్… దేర్ ఈజ్ పెయిన్ అనే క్యాప్షన్‌తో ఈ చిత్రం వస్తోంది. రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః విష్ణు వర్మ, సంగీతంః గోపీసుందర్, ఆర్ట్‌ః సాహి సురేష్, ఎడిటర్‌ః ప్రవీణ్ పూడి, యాక్షన్‌ః వెంకట్.

 Majili movie teaser released on Feb 14th