Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

కోర్టును ఆశ్రయించిన మేజర్ తండ్రి

MAJOR

శ్రీనగర్ : సోపియాన్‌లో నిరసనకారులపై జరిగిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు బాధ్యుడిని చేస్తూ పోలీసులు మేజర్ ఆదిత్యాకుమార్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆదిత్యపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని సుప్రీంకోర్టు జమ్ముకశ్మీర్ పోలీసులను ప్రశ్నించింది. ఆ ప్రాంతంలో కాల్పులు జరిగిన సమయంలో తన కొడుకు ఆదిత్య ఘటనాస్థలిలో లేడని, అతడిపై నమోదైన కేసును కొట్టి వేయాలని ఆదిత్య తండ్రి లెఫ్టినెంట్ కల్నల్ కరమ్‌వీర్ సింగ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేసింది. ఈ వ్యవహారంపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని, జమ్ముకశ్మీర్ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Major’s Father Approached the Court

Comments

comments