Home ఎడిటోరియల్ రాష్ట్రోపాధ్యాయ సంఘం రూపకర్త మఖ్దూం

రాష్ట్రోపాధ్యాయ సంఘం రూపకర్త మఖ్దూం

Kukhdum1నిజాం నిరంకుశ పాలన కొనసాగుతున్న రోజులవి, ప్రతి పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా “ప్రపంచ మున్నంతవరకు భగవంతుడు ఈ రాజుగారి పాలననే వుంచుగాక” అని ప్రార్థన చేసే నియమం వున్నది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న “అంజుమనే అసాతేజా” అనే సంఘంలో ఉపాధ్యాయులందరు నిర్బంధంగా సభ్యులుగా ఉండవలసిన దుస్థితి. సాటి ఉపాధ్యాయుల నిస్సహాయతలను గ్రహించి, ఆగ్రహించి 1945లో “ఫయాం” అనే జాతీయ పత్రిక నిర్వాహకుడు “అబ్దుల్ గఫూర్‌” తన సంపాదకీయం లో ఉపాధ్యాయులు తమ బానిస సంకెళ్లను బద్దలుకొట్టు కోవాలని హెచ్చరించారు. ఆ ప్రేర ణతో 1946 మే 17న ‘మఖ్దూం మొహియుద్దీ న్’ ఇంట్లో సమా వేశ మైన కొందరు ఉపాధ్యా యులు ‘స్వతంత్ర ఉపా ధ్యాయ సంఘానికి’ నాంది పలికారు. 1947 జూన్ 9వ తేదీన ఆనాటి ప్రభుత్వ ఉత్తర్వు 1890 మేరకు సంఘానికి గుర్తింపు లభించింది. ‘హైదరా బాద్ స్టేట్ టీచర్స్ యూనియన్ గా’ వెలసిన ఆ సంస్థ ఆంధ్ర ప్రదేశ్ అవతరణానం తరం “రాష్ట్ర ఉపా ధ్యాయ సంఘం” (The state teachers union)గా రూపాంతరంచెందింది.
అటువంటి ఉపా ధ్యాయ సంఘాన్ని స్థాపిం చిన ‘మఖ్దూం మొహి యుద్దీన్ గారు ‘నిరాడం బరుడు’, ఉర్దూకవి, కమ్యూనిస్టు మేధావి. ఆయిన 4-2-1908న ‘మెదక్ జిల్లా ఆందోల్‌లో జన్మించారు. ఆయన తండ్రి ‘గౌస్ మొహియుద్దీన్’ నిజాం ప్రభుత్వంలో సూపరింటెం డెంట్‌గా పనిచేసే వారు. మఖ్దూం తన నాల్గవ ఏటనే తండ్రిని కోల్పోవటం, తల్లి మరో పెళ్లి చేసుకోవడంతో అతడు తన బాబాయి (చిన్నాన్న) వద్ద పెరిగి ప్రాథమిక విద్యను హైదరాబాద్‌లోని ప్రస్తుత “ధర్మావంత్‌” పాఠశా లలో మెట్రిక్యులేషన్, ‘సంగారెడ్డి’ లో ఉన్నత విద్యను 1929-37లో ఉస్మానియా యూనివర్శిటీలో కొనసాగిం చారు. ఆర్థిక ఇబ్బందుల వలన ‘పెయింటింగ్’ సినిమా తారల ఫోటోలు అమ్మేవాడు.
ట్యూషన్స్ చెప్పడం, కవితలు అంటే మక్కువ. అందుకే కవిగా, నాటక రచయిత గా, నటుడిగా ప్రసిద్ధుడు. 1934లో ‘హోష్ కె నా ఖూన్’ అనే ఉర్దూ నాటకాన్ని హైదరాబాద్‌లో గురుదేవులు ‘రవీంద్రనాథ్ ఠాగూర్’ సమక్షంలో ప్రదర్శించి అతని మెప్పు పొందారు. తన 29వ ఏట ఎం.ఎ డిగ్రీ పట్టా పొంది సిటీ కాలేజీలో అధ్యాపకుడిగా ఉద్యోగం ప్రారంభించారు. 1940లో తన సహచరులతో కలిసి కమ్యూనిస్టు పార్టీలో చేరి చండ్ర రాజేశ్వరరావు, గులాం హైదర్, రాజ్‌బహ దూర్‌గౌర్ వంటి నాయకులలో పనిచేస్తుండేవారు. అదే విధంగా హైదరాబాద్‌లోని అనేక కంపెనీల్లోని కార్మిక సంఘాలకు అధ్యక్షు డయ్యారు. నల్లగొండ జిల్లా ‘హుజూర్ నగర్’ నుండి శాసన సభకు ఎన్నికయ్యారు. ఫాసిజానికి వ్యతిరేకంగా, సమసమాజ స్థాపనకోసం క్రియాశీలకంగా ప్రగతిభావాలతో పీడితుల పక్షాన పోరాడారు. ‘రైతుకు రొట్టెనివ్వని పొలమెందుకు కాల్చేయండి ప్రతి గోధుమ కంకిని’ అనే ఇక్బాల్ కవితను నినదించేవాడు. ఒకసారి అసెంబ్లీలో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా, ‘ఫూల్‌చంద్ గాంధి ఆరోగ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ‘మఖ్దూం’ ఆ శాఖలోని అవకతవ కలను, అవినీతిని ఎత్తి చూపడానికి ‘ఫూల్ చంద్-కాంటే బహుత్’ (పూవులు కొంచెం – ముళ్లేమో ఎక్కువ) అని చలోక్తిగా మాట్లాడారు. అధ్యాప కుడిగా, ఉర్దూ కవిగా, గాయకుడిగా ఉన్న అతని ‘గజల్స్’ పాఠ్యాంశాలలో, సినిమాలలోను ఉపయోగించారు. 1944-..25 మధ్యకాలంలో ‘తెలంగాణ’ అనే కవితను రాశారు. అందులో ‘ఏ జంగ్ హై జంగే ఆజాదీ’ అనే ఆయన గీతం, అంతర్జాతీయ గీతంగా రూపుదిద్దుకుంది. అతడు ఏనాడు మతాన్ని దూషించలేదు, అను సరించలేదు. తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్యపాత్రధారి, అజ్ఞాత వాసం గడిపిన వ్యక్తి.
అటువంటి మహోన్నత వ్యక్తి, ఉపాధ్యాయులు తమ ‘బానిస సంకెళ్ళను’ తెంచుకోవాలని సూచిస్తూ వారి కోసం రాష్ట్రోపాధ్యాయ సంఘాన్ని ఆవిర్భవింపచేసిన ‘మఖ్దూం’ ఆగస్టు 25, 1969 రోజున మరణించారు.
ఆగస్టు 25న వర్థంతి
– వై.కరుణాకర్‌రెడ్డి,
రాష్ట్రోపాధ్యాయసంఘం (STUTS) రాష్ట్ర నాయకులు