Home ఆఫ్ బీట్ వీడియోలు ఇవి స్వర్ణ మసూరి కావు, సాంబ మసూరి కావు… చైనా ప్లాస్టిక్ రైస్…!!

ఇవి స్వర్ణ మసూరి కావు, సాంబ మసూరి కావు… చైనా ప్లాస్టిక్ రైస్…!!

చైనా… ప్రపంచంలోనే ఎక్కువ పాపులేషన్ కలిగిన దేశంగా రికార్డులకెక్కిన ఈ చైనా… మనుషులను సృష్టించడంలోనే కాదు… మిగితా వస్తువులను సృష్టించడంలోనూ ముందంజలో ఉంది.

అవును.. చైనా కు సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. అలా… ఆ దేశపు జనాల ఆరోగ్యాలే కాదు… ప్రపంచ దేశాల ప్రజల ఆరోగ్యాలతోనూ చెలగాటాలాడుతోంది.

ఎవరైనా బియ్యాన్ని పంట వేసి పండిస్తారు.. కాని, ఈ చైనా మాత్రం పనికి రాని ప్లాస్టిక్ ను ప్రాసెస్ చేసి అచ్చు గుద్దినట్లు రియల్ రైస్ లా తయారు చేస్తుందట.

చేసుకుంటే చేసుకుంది.. వాటిని వాళ్ల దేశంలోనే డిస్ట్రిబ్యూట్ చేయొచ్చుగా.. కాని, ఇప్పుడు ఆ ప్లాస్టిక్ రైస్ ను ఇండియా, సింగపూర్, వియత్నాం, ఇండోనేషియా తదితర దేశాలకు ఎగుమతి చేస్తోందట.

అంటే, ఈ ప్లాస్టిక్ రైస్ ను తెలిసో, తెలియకో మన దేశ ప్రజలు కూడా తిని ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇక, వీళ్లు ఈ ప్లాస్టిక్ రైస్ ను ప్రాసెస్ చేయడానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో తెగ హల్ చల్ చేస్తోంది.. మీరూ ఓ సారి చూసేయండి ఆ వీడియోను.. కాని, కాపీ మాత్రం కొట్టకండి….సరేనా…..

https://www.youtube.com/watch?v=haSsXxxQBSo