Home సినిమా మహేష్ భార్యపై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు

మహేష్ భార్యపై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు

Namrata-and-Malaika-Arora

ముంబయి: టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్‌పై బాలీవుడ్ నటి మలైకా అరోరా సంచలన వ్యాఖ్యలు చేసింది. మరో బాలీవుడ్ నటి నేహ ధూపియా నిర్వహిస్తున్న వోగ్ బిఎఫ్‌ఎఫ్ అనే కార్యక్రమానికి హాజరైన మలైకా.. నమ్రతపై షాకింగ్ కామెంట్లు చేసింది. మోడలింగ్‌లో ఎదురైన అనుభవాలపై మలైకాకు నేహ అడిగిన ప్రశ్నకు మలైక సంచలన సమాధానం ఇచ్చింది. నమ్రతా శిరోద్కర్, మోహర్ జెస్సియా మోడలింగ్‌లో నాకు సీనియర్లని, అప్పటికే వారు టాప్ మోడల్స్‌గా ఉన్నారు. దాంతో అప్పుడే మోడలింగ్ రంగానికి వచ్చిన వారితో వారు పొగరుగా వ్యవహిరించేవారని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం వారిద్దరితోనూ స్నేహం కొనసాగిస్తున్నట్లు చెప్పింది.

 Malaika Arora Sensational Comments Against Namrata Shirodkar.