Home అంతర్జాతీయ వార్తలు చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాలాలా

చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాలాలా

Malala-Yousafzaiబర్మింగ్‌హామ్: నగరంలోని బాబర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్‌లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మాలాలా యూసఫ్‌జాయ్ ప్రముఖ చిత్రకారుడు నాజర్ ఆజం గీసిన తన ఫొటో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాలాలా 2014 సంవత్సరానికి గాను మన దేశానికి చెందిన కైలాష్ సత్యార్థితో కలిసి నోబెల్ శాంతి బహుమతి పొందిన విషయం తెలిసిందే. మాలాలా 15సం.రాల ప్రాయంలో అమ్మాయిల చదువు గురించి పోరాడినందుకు తాలిబన్ తీవ్రవాదులచేత తలభాగంలో తుపాకీతో కాల్చబడ్డారు. అప్పటి నుంచి ఆమె స్వదేశమైన పాకిస్తాన్‌ను వదిలి ఇంగ్లాండ్‌లోనే ఉంటూ చదువుకుంటున్నారు. మాలాలాను ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులు వరించాయి.