Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

నటుడు కళాశాల బాబు కన్నుమూత

Malayalam actor Kalasala Babu Passes away

ఎర్నాకుళం: మళయాల ప్రముఖ సీనియర్ నటుడు కళాశాల బాబు(66) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాబు ఆదివారం రాత్రి ఎర్నాకుళంలో తుదిశ్వాస విడిచారు. కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాబు గత రాత్రి సెలెబ్రల్ హ్యామరేజ్‌తో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకు కళాశాల బాబు దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా ప్రతినాయకుడి పాత్రలో బాబు మెప్పించారు. బాబు మృతిపట్ల మాలీవుడ్ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి సినీ ఇండస్ట్రీకి తీరనిలోటని వారు పేర్కొన్నారు.

Comments

comments