Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

మలయాళం నటుడు కొల్లం అజిత్ కన్నుమూత

KOLLAM

కొచ్చి : ప్రముఖ మలయాళం నటుడు కొల్లం అజిత్ గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. కడుపు సంబంధిత వ్యాధితో బాధపడుతూ కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన 500లకు పైగా సినిమాల్లో నటించారు. 1983లో పరన్ను పరన్ను పరన్ను సినిమాతో ఆయన సినిమా రంగంలోకి ప్రవేశించారు. చివరిసారిగా ఆయన 2012లో ఇవాన్ అర్ధనారి సినమాలో నటించారు. ఆయనకు భార్య ప్రమీల, కూతురు గాయత్రి , కొడుకు శ్రీహరి ఉన్నారు. అజిత్ మృతిపై పలువురు నటులు సంతాపం తెలిపారు.

Malayalam Actor Kollam Ajith Passes Away

Comments

comments