Home జాతీయ వార్తలు మలయాళ మనోరమ పాత్రికేయుడు షాజిల్‌కు ఐపిఐ అవార్డు

మలయాళ మనోరమ పాత్రికేయుడు షాజిల్‌కు ఐపిఐ అవార్డు

Sajil-Kumarన్యూఢిల్లీ: మలయాళ మనోరమ పాత్రికేయుడు షాజిల్ కుమార్‌ను ఈ సంవత్సరం ఇంటర్నేషనల్  ప్రెస్ ఇనిస్టిట్యూట్(ఐపిఐ)ఇండియా అవార్డుకు ఎంపిక చేశారు. పాత్రికేయ వృత్తిలో విశిష్ట సేవలందించిన వారికి గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తారు. కేరళలోని పశ్చిమ కనుమల వాలు ప్రాంతంలో జీవించే వారి జీవితాలపై ‘ఎండేంజర్డ్ ట్రైబల్ కమ్యూ నిటీస్’ (అంతరించిపోతున్న గిరిజన సమూహాలు)పేరిట ఆయన రాసిన ప్రత్యేక వార్తా కథనానికి గుర్తింపుగా ఆయనని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డు కింద రూ. 2 లక్షల నగదు, ట్రోఫీ, ప్రశంసాపత్రం ఇస్తారు. ఈ అవార్డుకు అనేక ఎంట్రీలు వచ్చినప్పటికీ మాజీ ప్రధాన న్యాయమూర్తి  ఎ.ఎస్.ఆనంద్ నేతృత్వంలోని జ్యూరీ షాజిల్ కుమార్‌నే ఏకగ్రీవంగా ఎన్నుకుంది. జ్యూరీలో ఎన్.రవి(ది హిందూ), ఎం.కె.రజ్దాన్(పిటిఐ), రియాద్ మాథ్యు(మళయాళ మనోరమ) ఉన్నా రు. సాంప్రదాయం, ఆధునికత మధ్య ఇరుక్కుపో యినా, తమదైన  జాతిప్రత్యేకను, సంస్కృతిని కలిగిన గిరిజనులపై షాజిల్ సూక్ష్మస్థాయిలో పరిశోధించి రాశారని వారభిప్రాయపడ్డారు. షాజిల్ వార్తా కథనాల పరంపర గిరిజనుల  ప్రతేక భాష, సంస్కృ తుల వైవిధ్యం,  వారెదుర్కొంటున్న భౌతిక, సాంస్కృతిక ముప్పులను వెలుగులోకి తెచ్చాయని పేర్కొన్నారు. షాజిల్ కుమార్‌కు ఈ అవార్డును 2016 జనవ రి మాసాంతంలో న్యూఢిల్లీలో జరిగే వేడుకలో ప్రదానం చేయనున్నారు.