Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

దొంగనోట్ల కేసులో మలయాళ నటి అరెస్ట్

arrest

చెన్నై: దొంగనోట్లను ముద్రించిన కేసులో మలయాళ నటి సూర్య శశికుమార్ (36)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ఆమె తల్లి రీమా దేవి, సోదరి శ్రుతిలను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కొల్లాంలోని తమ నివాసంలో రూ. 57 లక్షల దొంగ నోట్లను ముద్రించారు. ఈ కేసులో కొచ్చిలో వీరిని గుర్తించి అరెస్ట్ చేసినట్టు జిల్లా పోలీస్ అధికారి వేణుగోపాల్ చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కొల్లాంలోని వీరి నివాసంలోని పైఅంతస్తులో దొంగనోట్ల ముద్రణ జరుగిందని తెలిపారు. ఈ నోట్లను ముద్రించడానికి రూ. 4.36 లక్షలు ఖర్చు చేశారని చెప్పారు. తమకు వచ్చిన లాభాల్లో వాటా ఇవ్వాలనే ఒప్పందంతో దొంగనోట్లను చలామణి చేస్తున్నారని తెలియజేశారు. ఈ కేసులో తల్లి రీమా దేవిని ప్రధాన నిందితురాలిగా అనుమానిస్తున్నామన్నారు.  ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని  అతిత్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. ఇడుక్కిలో మూడు రోజుల కిందట రూ. 2.25 లక్షల నకిలీ నోట్లను సీజ్ చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా, సూర్య శశికుమార్, ఆమె తల్లి, సోదరిల పేర్లు బయట పడ్డాయని పోలీసులు పేర్కొన్నారు.

Comments

comments