Home అంతర్జాతీయ వార్తలు మరణ శిక్షను రద్దు చేసుకున్న మలేషియా!

మరణ శిక్షను రద్దు చేసుకున్న మలేషియా!

int

కౌలాలంపూర్‌: దేశీయంగా ఉరి శిక్షపై వస్తున్న తీవ్ర వ్యతిరేకత కారణంగా మలేసియా ప్రభుత్వ మంత్రి వర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమ్యూనికేషన్‌ మంత్రి గోబింద్‌ సింగ్‌ డియో వెల్లడించారు. త్వరలోనే దీనికి సంబంధించి చట్టం చేస్తామని ఆయన తెలిపారు.దీంతో మరణ శిక్షను రద్దు చేసుకున్న దేశాల సరసన ఇప్పుడు మలేసియా చేరనుంది. ప్రభుత్వ ఈ నిర్ణయాన్ని మానవ హక్కుల ఉద్యమకారులు స్వాగతించారు. మరణ శిక్ష ఓ క్రూరమైన, అనాగరికమైన చర్య అని.. ఇప్పుడు దేశంలో ఉరిశిక్ష రద్దైతే విదేశాల్లో మలేసియన్లకు మరణశిక్ష విధించే సందర్భాల్లో దాన్ని అడ్డుకునే నైతిక అధికారం ఉంటుందని లాయర్స్‌ ఫర్‌ లిబర్టీ రైట్స్‌ గ్రూప్‌ సలహాదారు ఎన్‌ సురేంద్రన్‌ పేర్కొన్నారు.మలేసియాలో.. హత్య, కిడ్నాప్‌, ఆయుధాలు కలిగి ఉండడం, మాదక ద్రవ్యాలు చెలామణీ చేయడం వంటి నేరాలకు పాల్పడ్డ సందర్భాల్లో మరణ శిక్ష విధిస్తారు.

Malaysia Government to abolish death penalty

Telangana News