Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

హలో హలో…

Malaika-Khan

‘గబ్బర్‌సింగ్’లో పవన్‌కళ్యాణ్‌తో కలిసి ‘కెవ్వు కేక…’ అంటూ హోరెత్తించిన భామ మలైకా అరోరా. వయసు పెరుగుతున్నా ఈ భామలో ఏమాత్రం గ్లామర్ తగ్గడం లేదు. 44 ఏళ్ల్ల బ్యూటీ తాజాగా ‘పటాకా’ అనే సినిమాలో ‘హలో హలో…’ అంటూ చేసిన ఐటమ్ సాంగ్ ఇప్పుడు సోషల్‌మీడియాలో సందడి చేస్తోంది. విశాల్ భరద్వాజ్ దర్వకత్వంలో రూపొందిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో ఈ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాటలో మలైకా వయ్యారాలు ఒలకబోస్తూ చేసిన డాన్స్ యూత్‌ను ఉర్రూతలూగిస్తోంది. గణేష్ ఆచార్య కంపోజ్ చేసిన స్టెప్పులకు కొత్త అందం తీసుకొచ్చింది ఈ బ్యూటీ. ఇక పటాకా కాన్సెప్ట్ బాగా నచ్చడం వల్లే ఈ పాట చేయడానికి ఒప్పుకున్నానని చెప్పింది మలైకా అరోరా. సాన్య మల్హోత్రా, రాధికా మదన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈ నెలాఖరున విడుదల కానుంది.

Comments

comments