Search
Friday 21 September 2018
  • :
  • :

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ సర్కార్ విఫలం

యూత్ కాంగ్రెస్ నిరాహార దీక్షలో టిపిసిసి ఉపాధ్యక్షుడు మల్లురవి

Mallu-Ravi

నవాబ్‌పేట: ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన  హామీలను నెరవేర్చడలో విఫలమైందని టి పిసిసి ఉపాధ్యక్షుడు మల్లురవి పేర్కొ న్నారు. శనివారం ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీల సబ్సిడీ నిధులు విడుదల చేయాలనే డిమాండ్‌తో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరహారదీక్షలో పాల్గొని ఆయన మాట్లాడు తూ ప్రభుత్వం అధికార దాహంతో అమలు కు వీలుకాని హామీలను మ్యానిఫెస్టోలో ఉంచి అధికారంలోకి వచ్చాక విస్మరించారు. బంగారు తెలంగాణ నినాదంతో ముందుకెళ్లు బాధల తెలంగాణగా తయారు చేస్తు న్నారన్నారు.

ప్రభుత్వం పనితీరు బడా కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉందని, సంక్షేమ పథకాలు కార్యకర్తలకు ప్రయోజనాలు కల్పింస్తున్నాయన్నారు. అలాగే రెండేళ్ల నుంచి మంజూరైన సబ్సిడి రుణాలు ఇంత వరకు అందజకపోవడం చూస్తే ప్రభుత్వ తీరు ఎలాఉందో అర్థమవుతుం దన్నారు. గత పాలనలో లక్షల మంది యువకులకు సబ్సిడి రుణాలు ఇచ్చి ఆర్థిక తోడ్పాటు అందించారు.

సబ్సిడి రుణాలు వెంటనే విడుదల చేయాల న్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బంగ్లరవి, డిసిసి ఉపాధ్య క్షులు రంగారావు, ప్రధాన కార్యదర్శి జహీర్ అక్తర్, జడ్చర్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాసు యాదవ్, మండలాధ్యక్షులు కోస్గి కుమా ర్, పట్టణ పార్టీ అధ్యక్షులు మల్లేపాగ నర్సింహులు, ప్రధాన కార్యదర్శి ముష్టి శ్రీను, నాయకులు కోట్ల రాజేష్, యాదయ్య, లింబ్యానాయక్, రాములు, షబ్బీర్, నవాజ్, రఘువీర్‌శర్మ, మరికంటి రాములు, మంచాల యాదగిరి, చాకలిపల్లి శేఖర్, రాజేశ్వర్‌రెడ్డి, యాదయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments