Search
Monday 24 September 2018
  • :
  • :

భారత్‌కు వచ్చేందుకు సిద్ధమవుతున్న మాల్యా?

malya

న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీ సుకుని విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా భారత్‌కు రావాలనుకుంటున్నా రా? అంటే అవుననే సమాచారం వినిపిస్తోంది. కిం గ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ కోసం తీసుకున్న రూ. 9వేల కోట్ల రుణాలను బ్యాంకులకు చెల్లించకుండా బ్రిటన్‌కు పారిపోయిన మాల్యాను వెనక్కిరప్పించేందుకు భారత్ ఏజెన్సీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు వచ్చి న్యాయ విచారణను ఎదుర్కొనేందుకు మాల్యా సిద్ధంగా ఉన్నారని అధికార వర్గాల తెలిపాయి. ఈ మేరకు మాల్యా తన ప్రతినిధులను దర్యాప్తు సంస్థల వద్దకు పంపి ఈ విషయాన్ని చెప్పినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లోని అధికారులు వెల్లడించినట్లు సమాచారం. ప్రస్తుతం మాల్యాపై లండన్‌లోని కోర్టులో విచారణ జరుగుతోంది. ఇటీవల భారత ప్ర భుత్వం పారిపోయిన నేరగాళ్ల విషయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కింద విచారణను ఎదుర్కొనేందుకు మాల్యా సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ ఆర్డినెన్స్ ద్వారా పారిపోయిన నేరస్తులకు చెందిన ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వానికి అధికారాలు ఉం టాయి. పారిపోయిన ఆర్థిక నేరస్తుడు (పుజిటివ్ ఎకనమిక్ అఫెండర్) కింద మాల్యాపై చర్యలు తీసుకోవాలని ఇడి ఇటీవల ముంబైలోని అవినీతి నిరోధక చట్టం ప్రత్యేక కోర్టును కోరింది. దీంతో కోర్టు ఆగస్టు 27న న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని మాల్యాకు సమన్లు జారీ చేసింది. మా ల్యా బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఆయనపై చర్య లు తీసుకుంటే మాల్యాకు చెందిన రూ. 12,500కోట్లు జప్తు చేసుకునే అధికారం ఉంటుం ది. కోర్టు సమన్లు జారీ చేసిన ప్రకారం, మాల్యా చెప్పిన తేదీకి కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉం టుంది. లేకపోతే మాల్యాను పారిపోయిన ఆర్థిక నే రగాడుగా ధృ-వీకరించి చర్యలు చేపడతారు.

Comments

comments