Home జాతీయ వార్తలు బెంగాల్‌లో మమత బెనర్జీకి షాక్!

బెంగాల్‌లో మమత బెనర్జీకి షాక్!

mamata banerjeeకోల్ కతా: పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. రాష్ట్రంలో బిజెపి అనూహ్యంగా పుంజుకుంది. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 42 లోక్‌‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో బిజెపి 18 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుంది. తృణమూల్ కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది.
గత ఎన్నికల్లో మొత్తం సీట్లలో 36 స్థానాలతో అఖండ మెజారిటీ సాధించిన టిఎంసి, ఈ ఎన్నికల్లో 22 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుంది. 2014 ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలు మాత్రమే పరిమితమైన బిజెపి, ఏకంగా 16 స్థానాల్లో దూసుకుపోతుంది. ఇటీవలే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా నిజం చేసే విధంగా అత్యధిక స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది.
West Bengal Election Results 2019