Home తాజా వార్తలు బిజెపికి ఓటమి తప్పదు: దీదీ

బిజెపికి ఓటమి తప్పదు: దీదీ

Mamata Banerjee
కోల్‌కత్తా: బిజెపి పాలిత రాష్ట్రాలన్నింటా ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ. రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌ ఎన్నికలలో బిజెపికి ఓటమి తప్పదని దీదీ జోస్యం చెప్పారు. దీని ప్రభావం రానున్నఅసెంబ్లీ ఎన్నికలపై తప్పక పడుతుందని ఆమె పేర్కొన్నారు. బెంగాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ… బెంగాల్‌లో అధికారంలోకి రావడానికే భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవన్నారు. తృణమూల్‌ ఓటు బ్యాంకును చీల్చడం ఎవరి తరమూ కాదని ఆమె స్పష్టం చేశారు. ఒకప్పుడు బెంగాల్‌ మావోయిస్టులతో ఎంతో ఇబ్బంది పడింది. కానీ  ఇప్పుడు అటువంటి సమస్య లేదని చెప్పారు. అదే బిజెపి పాలిత రాష్ట్రాలైన చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌లో ఆ సమస్య ఉండడం అక్కడి పాలకుల తీరుకు నిదర్శమని మమతా చెప్పారు.
Mamata Banerjee Said BJP Will Lose MP And Rajasthan

telangana latest news