Home జాతీయ వార్తలు ఢిల్లీలో పర్యటిస్తున్న మమతా బెనర్జీ

ఢిల్లీలో పర్యటిస్తున్న మమతా బెనర్జీ

MAMATA

ఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి , పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ మంగళవారం ఢిల్లీలో పర్యటించారు. బిజెపికి ప్రత్యామ్నాయంగా మరో ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఆమె పలు పార్టీలకు చెందిన నేతలు కలుసుకున్నారు. ఎన్‌సిపి నేత శరద్ పవార్, శివసేన నేత సంజయ్ రౌత్, ఆర్‌జెడి ఎంపి మీసా భారతిలను మమతా బెనర్జీ కలుసుకుని చర్చలు చేశారు. రాజకీయనేతలు కలిస్తే సాధారణంగా రాజకీయాల గురించే మాట్లాడుకుంటారని, ఇందులో దాచి పెట్టాల్సిందేమీ లేదని ఆమె పేర్కొన్నారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని ఆమె తెలిపారు.

Mamata Banerjee  Visiting the Delhi