Home జాతీయ వార్తలు పెళ్లిలో భర్త సరదా.. భార్య ప్రాణాలు తీసింది…!

పెళ్లిలో భర్త సరదా.. భార్య ప్రాణాలు తీసింది…!

celebratory fireభోపాల్: పెళ్లిలో సరదాగా ఓ వ్యక్తి తుపాకీతో జరిపిన కాల్పులు అతడి భార్య ప్రాణాలు తీశాయి. వ్యక్తి జరిపిన కాల్పుల వల్ల బుల్లెట్ ఆయన భార్యకే తగిలి తీవ్రంగా గాయపడి మృతిచెందింది. ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రిటైర్ ఆర్మీ ఆఫీసర్ అయిన ఆప్ సింగ్ తన భార్య పిల్లలతో కలిసి సోదరుడి వివాహానికి వెళ్లారు. అక్కడ పెళ్లి ఆచారంలో భాగంగా గాల్లోకి తుపాకీతో కాల్పులు జరుపుతుంటారట. దీంతో ఆప్ సింగ్ కూడా తన తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో అతడి తుపాకీలో బుల్లెట్స్ అయిపోయాయి. దాంతో గన్ లో బుల్లెట్స్ నింపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలింది. ఆ సమయంలో పక్కనే ఉన్న భార్య రజినీకి ఓ బుల్లెట్ తగిలింది. దాంతో ఆమెకు తీవ్రగాయమై భారీగా రక్తస్రామైంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన పెళ్లింట విషాదాన్ని నింపింది.

Man allegedly opened celebratory fire and killed his wife