Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఏడాది చిన్నారిపై అఘాయిత్యం… హత్య!

Baby Died after Woman gives birth in Toilet on Krishna Express

పుణే:  అభం శుభం తెలియని ఏడాది వయసున్న చిన్నారిపై ఓ మృగాడు అఘాయిత్యానికి పాల్పడి, ఆపై హతమార్చిన దారుణం మహరాష్ట్రలోని పూణెలో చోటుచేసుకుంది. తల్లిదండ్రుల పక్కన నిద్ర పోతున్న ఆ పసిపాపను ఎత్తుకెళ్లి  హత్యాచారానికి  పాల్పడ్డాడో కామాంధుడు. పుణెలోని  లోనికాల్బార్‌ ప్రాంతంలో గురువారం ఈ దారుణం జరిగింది. చిన్నారి కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికిన తల్లిదండ్రులకు ఆమె ఆచూకీ దొరకలేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి సిసి టివి కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ​ఆధారంగా నిందితుడిని మల్హరి బన్సోడే(22)గా గుర్తించారు. వెంటనే గాలించి బన్సోడేను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా  బుధవారం అర్థరాత్రి  పాపను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించాడు. అనంతరం చిన్నారి తలను నేలకోసి కొట్టి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. కాగా, బాధిత చిన్నారి తల్లిదండ్రులు తమిళనాడు నుంచి వచ్చి పుణెలో నివాసం ఉంటూ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

Comments

comments