Home జాతీయ వార్తలు భార్య, అత్తపై కత్తితో దాడి…

భార్య, అత్తపై కత్తితో దాడి…

Attack-with-Knifeవిశాఖపట్నం: జిల్లా పాడేరులో దారుణం చోటుచేసుకుంది. వర్మ అనే వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున భార్య జ్యోతి, అత్త సుజాతలపై కత్తులతో దాడి చేశాడు. ఈ ఘటనలో జ్యోతి, సుజాతకు తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరీ పరిస్థితి విషమంగా ఉండడంతో వైజాగ్ కెజిహెచ్‌కు తరలించారు. కుటుంబ కలహాలే ఈ దాడికి కారణమని సమాచారం. కాగా వర్మ, జ్యోతిలది ప్రేమ వివాహం కావడం గమనార్హం. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. వర్మ పరారీలో ఉండటంతో అతడి కోసం గాలిస్తున్నారు.