Search
Friday 21 September 2018
  • :
  • :

మంత్రి తలసాని సభలో ఆత్మహత్యాయత్నం

Suicide-Attempt

వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్న గొల్ల, కుర్మల బహిరంగ సభ రసాభాసగా మారింది. సభలో మంత్రి ప్రసంగిస్తున్నప్పుడు ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేయగా, కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేసి గాయపర్చారు. బుధవారం లక్ష్మీకృషా గార్డెన్ లో గొల్ల, కుర్మల బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభలో మంత్రి తలసాని ప్రసంగిస్తున్న సమయంలో తెలంగాణ పశుసంవర్థక పాలి టెక్నిక్ స్టూడెంట్ ఫెడరేషన్‌కు చెందిన కొంతమంది విద్యార్థులు అక స్మాత్తుగా ప్లకార్డులు, బ్యానర్‌తో అక్కడకు వచ్చారు. పశువైద్యశాఖలో ఖాళీ భర్తీ చేయాలని నినాదాలు చేస్తుండగా దివాకర్ అనే యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అక్కడే ఉన్న కొంతమంది నాయకులు, కార్యకర్తలు దివాకర్‌పై అనూహ్యంగా దాడి చేశారు. ఈ దాడిలో దివాకర్ మర్మాయవాలకు గాయాలయ్యాయి.

అనంతరం అతడిని వారు పోలీసులకు అప్పగిం చారు. పోలీసులు దివాకర్‌తో పాటు గణేష్‌రెడ్డి యాదగిరి, రాము, అరవింద్,శివ, భరత్, లను పెబ్బేరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సంఘ టన తెలుసుకున్న వనపర్తి కాంగ్రెస్ ఎంఎల్‌ఎ చిన్నారెడ్డి పెబ్బేరు పోలీస్ స్టేషన్‌లో యువకులను పరామర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని మంత్రిని కోరిన విద్యార్థులపై దాడిచేయడం అప్రజాస్వామికమని దాడికి పాల్పడిన టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని పోలీసు లను ఎంఎల్‌ఎ చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. వనపర్తి ఎంఎల్‌ఎ చిన్నారెడ్డి గాయపడిన దివా కర్‌ను వనపర్తిలోని శ్రీనివాస స్కానింగ్ సెంటర్‌కు తీసుకొచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించగా దివాకర్ మర్మావయవా లకు గాయాలు కావడం తో మెరుగైన చికిత్స కోసం మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Comments

comments