Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

కీచకుడికి దేహశుద్ధి

Repist

లక్నో: యుపిలోని హర్దోయ్‌లో ఓ కామాపిశాచికి తగిన బుద్ధి చెప్పారు అక్కడి స్థానికులు. అభం శుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యానికి యత్నించిన ఆ కీచకుడిని గుండు గీసి, మెడలో చెప్పుల దండతో ఊరేగించి పోలీసులకు అప్పగించారు. ఘటన వివరాల్లోకి వెళితే… స్థానికంగా ఉండే మస్తానా అనే వ్యక్తి మాయమాటలు చెప్పి ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిపై లైంగిక దాడికి యత్నించాడు.

అయితే ఇది గమనించిన బాలిక తల్లి వెంటనే పెద్దగా కేకలు వేస్తూ ఇరుగుపొరుగు వారిని పిలిచింది. దాంతో అందరూ అక్కడికి చేరుకుని మస్తానాను చితకొట్టారు. అనంతరం గుండు గీసి, మెడలో చెప్పుల దండ వేసి మహిళలతో చెప్పుతో కొట్టించారు. ఆ తరువాత గ్రామంలో ఊరేగించారు. సమాచారం అందుకున్న పోలీసులు మస్తానాను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Man beaten by People who trying to rape minor girl in Hardoi, UP.

Comments

comments