Search
Thursday 15 November 2018
  • :
  • :

వ్యక్తి దారుణ హత్య!

Daughter killed Father with help of Boyfriend in Andhra Pradesh

రంగారెడ్డి: కొందరు దుండగులు ఓ వ్యక్తిని అతి కిరాతకంగా బండరాళ్లతో కొట్టి చంపేసిన దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్‌లో చోటుచేసుకుంది. అత్తాపూర్‌లో పిల్లర్ నెంబర్ 143 వద్ద ఈ ఘటన జరిగింది. వాటర్‌ప్లాంట్ నడుపుతున్న ఖాళేడ్(35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బహదూర్‌పురాకు చెందిన ఖాళేద్‌ను గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి, బండరాయితో కొట్టి చంపేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments