Home జాతీయ వార్తలు పట్టపగలే నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య…

పట్టపగలే నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య…

Murder

ముంబయి :పట్టపగలే నడిరోడ్డుపై  వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటనా ముంబయిలోని ఘట్కోపర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటన సోమవారం చేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బబ్లూ దూపేయి అలియాస్‌ చోటీ అనే వ్యక్తి రహదారి పక్కన నిలబడి బస్సు కోసం వేచి చూస్తున్నాడు. ఇంతలో ఆటోలో ముగ్గురు వ్యక్తులు వచ్చి కత్తులతో బబ్లూ పై దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులు బబ్లూను విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి పారిపోయారు. ఈ ఘటనలో బబ్లూ తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే స్పృహ కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన బబ్లూను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా నిదింతుల్లో మరొకరు పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యకు సంబంధించిన వీడియో స్థానికంగా ఉన్న సిసి టివి కెమెరాలో రికార్డు అయింది.

Man Brutally Murdered At Ghatkopar In Mumbai