Home జాతీయ వార్తలు యువతి స్నానం చేస్తుండగా…

యువతి స్నానం చేస్తుండగా…

Man caught red-handed while video graphing girl bathing : Tamil nadu

చెన్నై: ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా మహిళలపై ఆకతాయిల వేధింపులు పెచ్చుమిరుతున్నాయి. ఏదో ఒకరకంగా మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు పోకిరీలు. తాజాగా తమిళనాడులోని తిరువొత్తియూరులో ఓ వ్యక్తి, యువతి స్నానం చేస్తుండగా వీడియో తీశాడు. దీంతో సదరు వ్యక్తిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఘటన వివరాల్లోకి వెళితే… తిరువొత్తియూరు ఈశాన్యమూర్తి ఆలయ వీధిలోని ఓ అపార్ట్ మెంట్ లో పదికి పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇదే గృహసముదాయంలో ఓ ఇంట్లో రాజన్‌ అనే వ్యక్తి కూడా నివసిస్తున్నాడు. అయితే, గురువారం అతడి ఇంటికి సమీపంలో ఉన్న మరో ఇంట్లో ఓ యువతి స్నానం చేస్తుండగా రాజన్‌ తన మొబైల్ తో వీడియో తీశాడు. కాగా, బాధిత యువతి పైకి చూడటంతో సదరు వ్యక్తి సెల్‌ఫోన్‌లో వీడియో తీయడం కనిపించింది. దాంతో ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఆమె ఇంటికి పరుగెత్తుకు వచ్చారు. దీంతో యువతి జరిగిన విషయం వారికి చెప్పింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు రాజన్ ను ఇంటి నుంచి బయటికి లాగి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రాజన్ ను అదుపులోకి తీసుకుని, అతడి మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.