Home జగిత్యాల తాగిన మైకంలో గొంతు కోసుకున్నాడు

తాగిన మైకంలో గొంతు కోసుకున్నాడు

Neck-Cut

ధర్మపురి: మద్యం తాగిన మైకంలో కత్తితో గొంతు కోసుకుని ఓ వ్యక్తి ఆత్మ హత్యకు పాల్పడిన సంఘటన తుమ్మెనాల గ్రామంలో చోటుచోసుకుంది. ఎస్‌ఐ రామకృష్ణ కథనం ప్రకారం వివ రాలిలా ఉన్నాయి. బుగ్గారం మండలంలోని వెల్గొండ గ్రామానికి చెందిన చిల్కూరి ప్రవీణ్(40) మద్యానికి బానిసై తల్లి, భార్యను తరచూ వేధిస్తుండేవాడు. వేధింపులను భరించలేక భార్య జయంతి పుట్టినిల్లైన ధర్మపురి మండలంలోని తుమ్మెనాల గ్రామానికి వెళ్లింది.

కాగా అత్తగారింటికి వెళ్లి భార్యను కాపురానికి రావాలని అడిగాడు. మద్యం మానేస్తే వస్తానని భార్యం చెప్పడంతో రాత్రి అత్తగారింట్లోనే నిద్రించాడు. ప్రవీణ్ తన వద్దనున్న కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం గుర్తించిన భార్య పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని చిన్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణ వివరించారు.