Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

నాన్‌వెజ్ వండలేదని వ్యక్తి ఆత్మహత్య!

Man committed Suicide in Hyderabad

హైదరాబాద్: ఇంట్లో నాన్‌వెజ్ వండలేదనే చిన్న కారణంతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. భార్యకు చికెన్ వండిపెట్టమని చెబితే పట్టించుకోలేదని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యూసుఫ్‌గూడ పరిధిలోని జవహర్‌నగర్‌లో సత్యనారాయణ(52), దేవకి దంపతులు ఉంటున్నారు. మద్యానికి బానిసైన సత్యనారాయణ ఇంట్లోనే ఉంటున్నాడు. దేవకి కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తుంది. ప్రతిరోజు పూటుగా మద్యం తాగొచ్చి సత్యనారాయణ తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం భార్యతో వాగ్వాదానికి దిగాడు. తనకు చికెన్ చేసి పెట్టాలని భార్యతో చెప్పాడు. అయితే తాను పనికి వెళ్తున్నానని తిరిగి వచ్చిన తర్వాత చేసి పెడతానని వెళ్లిపోయింది. అయితే, తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చిన దేవికకు భర్త ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అప్పటికే అతడు మృతి చెంది ఉన్నాడు. దేవిక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments