Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

యువతి గొంతు కోసిన ఉన్మాది

16WLSBR01P2ఏటూరునాగారం: వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన జనగాం లక్ష్మి(19) గొంతును అదే గ్రామానికి చెందిన యువకుడు రాజబాబు బ్లేడుతో కోసి గాయ పరిచిన సంఘటన శనివారం అర్ధరాత్రి జరి గింది. ఏటూరునాగారం ఎస్సై విన య్‌కుమార్ తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. బు ట్టాయిగూడెం గ్రామానికి చెందిన రాజబాబు (25), లక్ష్మిలు కొన్ని సంవత్సరాలుగా ప్రేమిం చుకుంటున్నారు. అయితే రాజబాబుకు తన మేనత్త కూతురుతో ఇటీవల పెళ్లి నిశ్చయ మైంది. శనివారం రాత్రి లక్ష్మి తన తల్లి మల్ల క్కతో నిద్రిస్తుండగా నీతో మాట్లాడే పని ఉందని చెప్పి లక్ష్మిని తీసుకుని రాజబాబు అడవిలోకి తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా వారి మధ్య పెళ్లి విషయం ప్రస్తావనకు వచ్చింది. తనను ప్రేమిం చి వేరేవారిని పెళ్లి చేసుకుంటావా అని లక్ష్మి రాజబాబును నిలదీసింది. అప్పటికే లక్ష్మిని వదిలించుకోవాలనే ప్రణాళికతో ఉన్న రాజ బాబు తన దగ్గర ఉన్న బ్లేడుతో గొంతుకోశాడు. దీంతో లక్ష్మీ స్పృహ తప్పి పడిపోయింది. అయితే లక్ష్మీ చనిపోయిందని భావించిన రాజబాబు అక్కడే వదిలి పారిపోయాడు. స్పృహ వచ్చిన లక్ష్మీ ఆదివారం ఉదయం 6గంటలకు ఏటూర్‌కు చేరుకుంది. లక్ష్మీని రక్తపు మరకలతో చూసిన అక్కడి ప్రజలు ఏటూర్ గ్రామ పంచాయతీ కార్యాలయనికి తీసుకవచ్చాడు. లక్ష్మీ గొంతు కోయడంతో నోరు మూగబోయింది. విఆర్‌వో నర్సయ్య, స్థానిక ప్రజలు ఎస్సై వినయ్‌కుమార్‌కు సమాచారం అందించారు. రక్తపు మరకలతో ఉన్న లక్ష్మీని 108 అంబులెన్స్ ద్వారా స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా కంతనపల్లిలో వాహనం దిగబడింది. అక్కడినుంచి బోలోరో వాహనం ద్వారా లక్ష్మీని ఏటూర్‌నాగారం ఆసుపత్రికి తీసుకవచ్చి అక్కడినుంచి అత్యవసర చికిత్స కోసం ఎంజిఎంకు తరలించారు.అయితే రాజబాబు గొంతు కోసినట్లు లక్ష్మీ కాగితంపై రాసి ఇచ్చింది. ఈ సంఘటనపై ఎస్సై వినయ్‌కుమార్ మాట్లాడుతూ లక్ష్మీ తల్లి మల్లక్క ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నామని ఎస్సై తెలిపారు.

Comments

comments