యాదాద్రి భవనగిరి: వ్యక్తి పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలొదిన విషాద సంఘటన యాదాద్రి భవనగిరి జిల్లాలోని జమ్మపురం గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. లారీ పక్కన కింద పడుకున్న వ్యక్తిని గమనించని మరో లారీ డ్రైవర్ అతడి పైనుంచి పొనిచ్చాడు. దాంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. అది గమనించిన పెట్రోల్ బంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పెట్రోల్ బంక్ సిబ్బంది సమాచం మేరకు ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.