Home తాజా వార్తలు పెళ్లి ట్రాక్టర్ బోల్తా … యువకుడి మృతి

పెళ్లి ట్రాక్టర్ బోల్తా … యువకుడి మృతి

Road Accidentఇల్లెందు (భద్రాద్రి కొత్తగూడెం) : ఇల్లెందు మండలం మర్రిగూడెం గ్రామ సమీపంలోని రామకృష్టాపురం వద్ద బుధవారం రాత్రి పెళ్ళి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు.  మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. టేకులపల్లి మండలం కొప్పురాయి గ్రామ సమీపంలోని రాజారాం తండాకు చెందిన పిడుగు మౌనిక, ఇల్లెందు మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఎండ్రు ప్రభాకర్ వివాహం బుధవారం సత్యనారాయణపురంలో జరిగింది. వివాహం అనంతరం ఆడపెళ్లి వారు ట్రాక్టర్‌లో స్వగ్రామానికి వెళ్తుండగా పాతర్లగడ్డ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న రహదారిపై ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కొల్లాపురం గ్రామానికి చెందిన గుండేల వినోద్(18) అక్కడిక్కక్కడే మృతి చెందాడు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో గుండేల నరేష్, పిడుగు స్వరూప, పిడుగు శిరీష, అనూష, నాగమణి, పునూజ, శివకుమార్, మాల్య, మంగీని తదితరులు ఉన్నారు. వారిని ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోస్టుమార్టం కోసం వినోద్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Man Dead In Road Accident At Bhadradri Kothagudem