Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదం…క్షణాల్లో కాలి బూడిదైన యువకుడు

రోడ్డు ప్రమాదం…క్షణాల్లో కాలి బూడిదైన యువకుడు

 

Bike Accident

 

బెంగళూరు: కర్నాటక రాష్ట్రం కోలార్ జిల్లా బంగారుపేట రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ యువకుడు బైక్ ను అతి వేగంగా నడుపుతూ… ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు. బస్సును బైక్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగి  ఘటనా స్థలంలో ఆ యువకుడు కాలి బూడిదయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు, బైక్ పూర్తిగా కాలిపోవడంతో పోలీసులు అతడిని గుర్తుపట్టలేకపోతున్నారు. 

 

Man Dead in Road Accident in Karnataka