Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఆ కామెంట్లు రావడంతో…. ఫేస్ బుక్ నుంచి ఈ పెళ్లి ఫోటోను తీసేశాడు…!!

Wedding-couple-deleted-wedd

చూశారుగా ఈ పెళ్లి ఫోటోను. పాపం.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఎంతో కష్టపడి మరి ఈ వెడ్డింగ్ ఫోటోలు దిగి.. ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారట. అయితే, ఈ ఫోటోకు వచ్చిన కామెంట్లు వీళ్లకు విపరీతమైన కోపాన్ని తెప్పించాయట. అంతే, వెంటనే మనోడికి చిరాకు వచ్చి పెళ్లి ఫోటోలను మొత్తం డిలీట్ చేసి పడేశాడట.

అసలు ఆ ఫోటో కు ఏం కామెంట్స్ వచ్చాయనేగా మీ డౌట్… ? ఆ… అక్కడికే వస్తున్నా… ఆ ఫోటోను జాగ్రత్తగా గమనిస్తే… వాళ్ల వెనుక ఓ స్టైలిష్ కారు పార్క్ చేసి ఉంది గదా.. ఇక.. ఆ కారు గురించే అందరు కామెంట్ చేయడం మొదలు పెట్టారట.

ఎక్కడిది ఈ కారు…అబ్బ ఎంత బాగుంది… సూపర్ కార్.. నైస్ కారు… కారు ప్రైస్ ఎంత… ఎప్పుడు ఈ కారును కొన్నావు… అంటూ ఇలా పనికిమాలిన కామెంట్లన్నీ మనోడి కారుకే వచ్చాయట కాని, అంత కష్టపడి ఫోటో దిగితే మాత్రం ఒక్కడూ తమ పెళ్లి ఫోటో మీద కామెంట్ చేయలేదట.

దీంతో, మనోడికి చిర్రెత్తుకొచ్చిందట. అంతే దెబ్బకు పెళ్లి ఫోటోలన్నింటినీ ఫేస్ బుక్ నుంచి డిలీట్ చేశాడట.

ఢిల్లీకి చెందిన అంకిత్, నేహా… కొన్ని రోజుల కిందనే పెళ్లి చేసుకున్నారట. ఇక, పెళ్లికి ఎంతో కష్టపడి లెహంగా, జ్యూయలరీ వేసుకొని మరీ ఫోటోలు దిగితే ఒక్కడంటే ఒక్కడు వాటిమీద కామెంట్ చేయడే అని వాపోతుందట పెళ్లి కూతురు. నిజమేకదా.. పాపం.. కనీసం ఒక్క కామెంట్ అన్నా వాళ్ల ఫోటో మీద చేస్తే బాగుండేది కదా…

అసలు అందరు ఆ కారు గురించే ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదంటూ పెళ్లి కొడుకు సైతం మొహం మాడ్చాడట. అయితే, ఆ కారు గురించి ఎంక్వయిరీ చేస్తే… పెళ్లి కి వచ్చిన పెళ్లి కొడుకు ఫ్రెండ్ దట.

అది నిస్సాన్ టెర్రానో 6 కారు అంట. ఇక, ఈ కారు గొడవలు మనకెందుకులే అని మారిషస్ కు హనీమూన్ ప్లాన్ చేశారట ఈ జంట. అయితే, అక్కడన్నా…వీళ్లు హైలైట్ అయ్యేలా ఫోటోలు దిగి ఫేస్ బుక్ లో పెడితే బాగుంటుంది… లేకపోతే మునుపటి ఆటే …. ఏమంటారు?

Comments

comments