Search
Saturday 17 November 2018
  • :
  • :

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ROAD-ACCIDENTచేగుంట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన చేగుంట మండల పరిధిలోని రెడ్డిపల్లి బైపాస్ 44వ జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భీంరావు పల్లి గ్రామానికి చెందిన కాపు నర్సింలు(35) సైకిల్‌పై చేగుంటకు వస్తు రెడ్డిపల్లి గ్రామ బైపాస్ రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెలుతున్న సూపర్ లగ్జరి నాన్‌స్టాప్ బస్ ( ఎపి25జడ్0066) నర్సింలును ఢీ కోట్టగా నర్సింలు అక్కడికక్కడే మృతి చెందాడు. శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం మెదక్ ఎరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

Comments

comments