Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

లారీ యాక్సిడెంట్‌లో వ్యక్తి మృతి

Man died in lorry accident

అడ్డాకుల: గత రెండు రోజుల కింద అడ్డాకుల మండల పరిధిలోని పల్లవి దాబా దగ్గర ప్రమాదానికి గురైన వ్యక్తి మృతి చెందినట్టు అడ్డాకుల హెడ్‌కాసిస్టేబుల్ రాజేందర్‌రెడ్డి తెలిపారు. రాజేందర్‌రెడ్డి కథనం ప్రకారం… అడ్డాకుల పల్లవి దాబా దగ్గర బుధవారం ఆగి ఉన్న TS 06VA8999 అను నెంబర్ గల లారీ కింద మధ్యప్రదేశ్ రాష్టానికి చెందిన రాజ్‌కుమార్ చౌహాన్ 27 విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గమనించని రెండో డ్రైవర్ లారీని వెనకకు నడిపాడు దాంతో లారీ కింద ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా హైదారాబాద్‌కు తరలించగా గాంధీ ఆస్పత్రిలో మృతి చెందినట్టు రాజేందర్ తెలిపారు. కాగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు రాజేందర్‌రెడ్డి తెలిపారు.

Comments

comments