Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Man Died In Road Accident In Medchal District
మేడ్చల్ ః రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామానికి చెందిన బేకు రమేశ్(54) మేడ్చల్ మండలం శ్రీరంగవరం గ్రామానికి వచ్చి తన సైకిల్‌పై కానుకుంటకు తిరిగి వెళ్తుండగా నూతనకల్ గ్రామ పరిధిలో వెనుక నుండి వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో రమేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మేడ్చల్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Man Died In Road Accident In Medchal District