Home ఖమ్మం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Man Dies In Road Accident In Khammam District

ఖమ్మం  ః రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఖమ్మం రూరల్ మండలం వరంగల్‌ క్రాస్‌రోడ్డులో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జలగంనగర్ గ్రామానికి చెందిన నూతలపాటి వెంకట్ శేఖర్ ( 35) ఏదులాపురం క్రాస్ రోడ్డు నుండి వరంగల్‌ క్రాస్‌రోడ్డు వైపు ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా మార్గం మధ్యలోని వరంగల్‌ క్రాస్‌రోడ్డు వద్ద రోడ్డు బాగా లేక పోవడంతో ప్రమాదానికి గురై మృతి చెందాడు. మృతుని మేనమామ చిట్యాల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెంకట్రావ్ పేర్కొన్నారు.

Man Dies In Road Accident In Khammam District