Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Man Dies In Road Accident In RangaReddy District

కడ్తాల్: హైద్రాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై కడ్తాల్ మండల కేంద్రంలో ఎస్‌బీఐ బ్యాంక్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్‌హెచ్‌వో సుందరయ్య తెల్పిన వివరాల ప్రకారం….మండల పరిధిలోని సలార్‌పూర్ గ్రామానికి చెందిన గుమ్మడి రాంచంద్రయ్య(55) సొంత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై సలార్‌పూర్ నుంచి కడ్తాల్ గ్రామానికి వచ్చాడు. ప్రధాన రహదారిపై స్థానిక ఎస్‌బీఐ వద్ద ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతుండగా హైద్రాబాద్ వైపు వెళ్తున్న క్రూయిజర్ వాహనం ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనంపై నుంచి ఎగిరి పడిన రాంచంద్రయ్య రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ పై పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు గుమ్మడి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో సుందరయ్య తెలిపారు.