Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

కనబడకుండా పోయింది-శవమై దొరికింది

 

Man Dies Mistyrious In Vikarabad District

హత్య చేశారంటున్న కుటుంబ సభ్యులు
కేసు నమోదు చేసి దర్యాప్తు
చేస్తున్న పోలీసులు
మిస్టరీగా మారిన ఎక్‌మామిడి
షాహినిబేగం మృతి

మన తెలంగాణ/నవాబుపేట  ః  మండల పరిధిలోని ఎక్‌మామిడి గ్రామానికి చేందిని షాహినిబేగం గత ఆదివారం రోజున ఇంట్లో నుండి వేళ్లిపోయింది.బుధవారం రోజున దార్లపల్లి రాంచంద్రయ్య తండ్రి వీరప్ప భూమిలో గల బావిలో శవం అయి తేలింది. ఎస్సై నగేష్ తెలిపిన వివరాలు ప్రకారం ఎక్ మామిడి గ్రామానికి చేందిన షాహినిబేగం వయస్సు 33 ఈమేకు 12 సంవత్సరాల క్రితం శంకర్‌పల్లి గ్రామానికి చేందిన వ్యక్తితో వివాహం అయింది. కాని వారి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. తర్వాత లింగంపల్లికి చేందిన వ్యక్తితో రెండవ వివాహం చేశారు.ఆయనతో కూడా విభేదాలు రావడంతో విడిపోయారు.గత 5 సంవత్సరాలుగా తన తల్లిదండ్రుల ఇంటి వద్ద ఉండేది.అదే గ్రామానికి చేందిన శర్ఫోద్ధిన్‌తో సంబంధం పేట్టుకోవడం జరిగింది. వీరి ఇద్దరి మధ్య మనస్పర్థ్ధలు రావడంతో 1 సంవత్సరం నుండి తన అక్క అయిన బిబాన దగ్గర ఉంటుంది.ఈ ఆదివారం రోజున ఎక్‌మామిడి గ్రామంలో ఉర్సు ఉండటంతో రావడం అయినది.తిరిగి లిగంపల్లికి వెళ్లలేదు.కుటుంబీకులు గాలించినా ఫలితం లేకపోయింది. బుధవారం రోజున అక్క బిబానబేగం నవాబుపేట పోలిసులకు సమాచారమిచ్చారు.గురువారం రోజున ఎక్‌మామిడి గ్రామంలో గల వ్యవసాయ బావిలో శవంగా షాహినిబేగం తేలింది.మృతిరాలికి ఒక్క కుమారుడు కూడా ఉన్నాడు వయస్సు 10 సంవత్సరాలు 4 వ తరగతి షమినిబేగం అక్క అయిన బీబానబేగం దగ్గర ఉంటు చదువుకూంటున్నాడు. కుంటుబ సభ్యుల,అక్క బీబానబేగం తన చేల్లేలును ఎక్‌మామిడి గ్రామానిక చేందిన శర్ఫోద్ధ్దీన్ హత్యచేశాడు అని తేలుపడంతో వికారాబాద్ నుండి ఎస్సైఐ నగేష్ ప్రత్యేకంగా క్లూస్ టీం,డాగ్ క్సాడ్ ద్వారా కూడా వేతికించడం జరిగింది.అనంతరం మృతిరాలుని ఆసుపత్రికి తిసుకువేలేదుకు శరీరం లేకపోవడంతో అక్కడ వైధ్యాధికరిణితో, పోస్టుమార్టం(పంచనామా) చేయించి అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహని అప్పగిచారు. శర్ఫోద్ధిన్ పై అనుమానం ఉన్నది అన్నీ మృతిరాలి అక్క బీబానబేగం  ఫిర్యాదు మేరకు కేసు చేసి దర్యాప్తు చేస్తునాట్టు ఎస్సై నగేష్ తెలిపారు. ఫోస్టుమార్టం రిపోర్టు అధారంగా చర్య తీసుకుంటాం అన్నారు.

Comments

comments