Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

వైరా బస్టాండ్‌లో గుండెపోటుతో ప్రయాణికుడి మృతి

Man dies of a heart attack

మనతెలంగాణ,వైరాః వైరా బస్టాండులో గుండెపోటుతో జంగం వెంకటేశ్వరరావు(45) అనే వ్యక్తి మరణించిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నుండి ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రంలోని జగ్గయ్య పేటకు వెలుతున్న జంగం వెంకటేశ్వరరావు వైరా బస్టాండులో బస్సు దిగి జగ్గయ్యపేట వెళ్ళడానికి ఎదురు చూస్తున్న సందర్భంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బస్టాండ్ వద్దకు చేరుకొని మృతుడు కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అందించేందుకుగాను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారి కుటుంబసభ్యులు వచ్చిన తరువాత వారికి అందించారు. బస్టాండులో గుండెపోటుతో వ్యక్తి మరణించడంతో ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

Comments

comments