Search
Saturday 21 July 2018
  • :
  • :

నృత్యం చేస్తూనే మృత్యు ఒడిలోకి..!(వీడియో)

Man-Dies-On-Stage

జైపూర్: అప్పటి వరకు ఎంతో హూషారుగా నృత్యం చేస్తూ కనిపించిన యువకుడు కొన్ని క్షణాల వ్యవధిలోనే మృత్యు ఒడిలోకి చేరాడు. హృదయాలను కలిచివేసే ఈ విషాద ఘటన రాజస్థాన్ లోని బార్మర్ లో చోటుచేసుకుంది. ఒక యువకుడు ఎంతో సంతోషంగా స్టేజీపై నవ్వుతూ డ్యాన్స్‌ చేస్తుండగానే అతడిని మృత్యువు కాటేసింది. డ్యాన్స్‌ చేస్తూనే స్టేజీపై కుప్పకూలిపోయాడు. కుప్పకూలిన చోటే ప్రాణాలొదిలేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫంక్షన్ లో  ఒక యువజంట షారూఖ్ నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయింగే మూవీలోని ‘తుజే దేకా తో హే జానా సనం” అనే పాటకు డ్యాన్స్ చేస్తున్నారు. అయితే అప్పటి వరకు హూషారుగా డ్యాన్స్ చేసిన యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కాగా, అతడితో పాటు నృత్యం చేస్తున్న యువతి దానిని ఎదో తమాషాకు అలా చేస్తున్నాడనుకుంది. కానీ ఎంతకు అతడు లేవకపోవడంతో అమ్మాయి అతడిని లేపడానికి ప్రయత్నించింది. హూటాహూటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు తెలిపారు. గుండెపోటుతో యువకుడు మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. దాంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇప్పుడీ వీడియో నెటిజన్ల హృదయాలను ద్రవింప చేస్తుంది.

Comments

comments