Home సూర్యాపేట పాముకాటుతో గొర్రెల కాపరి మృతి

పాముకాటుతో గొర్రెల కాపరి మృతి

Man Dies With Snake Bite In Suryapet District

తుంగతుర్తి :మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి పచ్చిపాల గురువయ్య (50)గత శనివారం గ్రామ పొలిమేరల్లోని పొలాల్లో మందలు తోలి మంద కాపలాగా నిద్రిస్తుండగా , పాముకాటుకు గురైన సంఘటన చోటు చేసుకుంది. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు గురువయ్యను సూర్యాపేట లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గత వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురువయ్య శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గురువయ్యకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నట్లు బంధువులు తెలిపారు.గురువయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.