Home తాజా వార్తలు సిఎం కెసిఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి ఐదేళ్ల జైలుశిక్ష

సిఎం కెసిఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి ఐదేళ్ల జైలుశిక్ష

inappropriate comments on CM KCR

 

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన భువనగిరి జిల్లాకు చెందిన ఆకుతోట రామకృష్ణకు నాంపల్లి కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతోపాటు , రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. సోషల్ మీడియాలో సిఎం కెసిఆర్‌పై ఆకుతోట రామకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పాతబస్తీ నివాసి ఇబ్రహీం మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో ఇబ్రహీం ఫిర్యాదు మేరకు మాదన్న పేట పోలీసులు కేసును సిసిఎస్ పోలీసులకు బదిలీ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఐపీ అడ్రస్ ఆధారంగా ఆ వ్యక్తిని భువనగిరి జిల్లాకు చెందిన ఆకుతోట రామకృష్ణగా గుర్తించారు. ఈ మేరకు ఆధారాలు సేకరించిన సైబర్ క్రైం పోలీసులు పోలీసులు నిందితుడిని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు రామకృష్ణకు ఐదేళ్ల జైలు శిక్షతోపాటు , రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

Man faces 5 Years Jail for Scolding CM KCR in Social Media