Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పెండ్లి చేసుకుంటానని మోసం…

frad-image

అడ్డగుట్ట: ప్రేమించనన్నాడు నువ్వు లేకపోతే బ్రతకలేనన్నాడు… పెళ్లి చేసుకుంటానని పూర్తిగా మాయ మాటల్లోకి దించాడు. బాలిక గర్భం దాల్చడంతో పెండ్లి చేసుకోనన్నాడు. బాధితబాలిక ఫిర్యాదు మేరకు నిందుతుడిపై పోలీసులు కేసు నమోదు చేసి  తెలిపిన వివరాల ప్రకారం… తుకారాంగేట్ ప్రాంతానికి చెందిన బాలిక(17) మహేంద్రహిల్స్ లోని కేర్ టేకర్ సెంటర్ లో పనిచేస్తుంది. తుకారాంగేట్ కు చెందిన మంజులతో వెంకటేశ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.  కాగా నిందితుడి తల్లి రెండేళ్ల కిందట తన కొడుకు వెంకటేశ్ తో వివాహం చేస్తానని బాలికకు హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే బాలిక, వెంకటేశ్ ప్రేమిస్తున్నానని చెప్పాడు. దీంతో ఇద్దరు కలిసి తిరిగారు. పెండ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి లోబర్చుకున్నాడు. ప్రస్తుతం బాలిక గర్భం దాల్చడంతో వెంకటేశ్ ముఖం చాటేశాడు. మాట ఇచ్చిన నిందితుడి తల్లిని బాలిక ఈ విషయంపై ఆమెను ప్రశ్నించగా తన నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని విచారిస్తున్నారు.

Comments

comments