Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

సచిన్ కూతురుకు ఆకతాయి వేధింపులు

Sachin-Daughter-Sara

ముంబయి: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కూతురు సారాపై ఓ ఆకతాయి వేధింపులకు పాల్పడ్డాడు. దాంతో పోలీసులు ఆ వ్యక్తిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని బెంగాల్‌లోని మిడ్నాపూర్‌కు చెందిన దేవ్ కుమార్‌గా గుర్తించిన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు వేధింపులకు పాల్పడటంతో పాటు సారాను కిడ్నాప్ చేస్తానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. సారా ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడైన దేవ్‌ను అరెస్టు చేశారు. సచిన్ ఇంట్లోని ల్యాండ్ ఫోన్‌కు డిసెంబర్ 2 వరకు ఇరవై సార్లు నిందితుడు ఫోన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. డిసెంబర్ 5న బాంద్రా పిఎస్‌లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు టెలిఫోన్ టవర్ లోకేషన్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే దేవ్ మానసికస్థితి సరిగా లేదని అతడి కుటుంబీకులు తెలిపారు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

Man held for stalking Sachin Tendulkar’s daughter Sara.

Comments

comments