Search
Wednesday 26 September 2018
  • :
  • :

మోడల్‌ను ఇంట్లో బంధించిన ప్రేమోన్మాది

man-kidnap-modal

భోపాల్:ఓ ప్రేమోన్మాది ఓ మోడల్‌ను రూమ్‌లో బంధించిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. అమెను అతడు  సోమవారం తన ప్లాట్ కు తీసుకెళ్లాడు. అంతేకాకుండా స్థానికులకు ఆమె తన లవర్ అని చెప్పుకుంటున్న అతను బాధిత యువతిని తన రూం లోనే బంధీగా చేశాడు. ఆమె తనను ప్రేమిస్తోందని, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్పాడు. అయితే బంధీగా ఉన్న ఆ మోడల్‌ను విముక్తి కల్పించేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్లాట్‌కు వెళ్లిన పోలీసులు రోహిత్ ఇంట్లో అమ్మాయి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అమ్మాయిని ఇంట్లో చూశామని, ఆమె చుట్టు రక్తం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే విడిపించేందుకు వెళ్లిన అధికారులను కిడ్నాపర్ ఓ మొబైల్ చార్జర్, స్టాంప్ పేపర్ కావాలని అడిగాడు. 2నెలల కిందట ఇద్దరికీ ముంబయి పరిచయం ఏర్పడింది. 5 అంతస్తుల బిల్డింగ్‌లో అమ్మాయితో పాటు ఆమె తల్లదండ్రులు కూడా బంధీగా ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments