Home తాజా వార్తలు మూడేళ్ల కొడుకుపై తండ్రి కర్కశత్వం (వీడియో)

మూడేళ్ల కొడుకుపై తండ్రి కర్కశత్వం (వీడియో)

father-hit-his-son

హైదరాబాద్: ఓ కన్న తండ్రి తన కొడుకు ప్రాణాలతో చెలగాటం ఆడిన అమానుష ఘటన జగద్గిరిగుట్టలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శివ గౌడ్‌ (40), అనూషలకు ముగ్గురు పిల్లలున్నారు అయితే, శివగౌడ్‌ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని అమెను మోసం చేశాడు. దీంతో ఆ మహిళ  అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాధితతో పాటు పోలీసులు శివగౌడ్‌కు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న శివ పోలీసులను తీసుకుని ఎందుకొచ్చావని ఆ మహిళను హెచ్చరించాడు. తర్వాత ఇంట్లోకి వెళ్లి తన కొడుకు రిత్విక్‌ ను బయటకు తీసుకొచ్చి గిరగిరా తిప్పి అక్కడున్న ఓ ఆటోకేసి కొట్టాడు. ఈ ఘటనతో అందరూ షాక్ అయ్యారు. అతని భార్య అనూష కేకలు వేస్తూ… అతడి చేతిలోంచి బాలుడిని తీసుకుని నిలోఫర్‌ దవాఖానకు తరలించింది. దీంతో శివగౌడ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.